Header Banner

అయోధ్యలో నేడు అద్భుత దృశ్యం! రాముడి నుదిటిపై ప్రత్యేక తిలకం! విశేష పూజలు!

  Sun Apr 06, 2025 09:17        Devotional

శ్రీరాముడి జన్మభూమి అయోధ్యలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బాలరాముని ఆలయ నిర్మాణం తర్వాత ఇది రెండో రామనవమి వేడుక కావడంతో భక్తుల ఉత్సాహం ఎంతో ఎక్కువగా కనిపిస్తోంది. మార్చి 29న ప్రారంభమైన వసంత నవరాత్రి వేడుకలలో భాగంగా ఈ మధ్యాహ్నం 12 గంటలకు రాముల వారికి అభిషేకం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సూర్యకిరణాలతో బాల రాముడికి తిలకం దిద్దేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ మూడో అంతస్తు నుంచి గర్భగుడిలో సూర్యకిరణాలు ప్రసరించే విధంగా శాస్త్రీయంగా ఏర్పాటు చేయడం విశేషం. సనాతన ధర్మంలో సూర్యుని శక్తికి మూలంగా భావించే నేపథ్యంలో, ఈ శుభసందర్భాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున అయోధ్యకు చేరుకుంటున్నారు. ఈ అద్భుత దృశ్యాన్ని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రత్యక్ష ప్రసారం చేయనుండటంతో, ప్రపంచవ్యాప్తంగా భక్తులు దీన్ని తమ ఇళ్ల నుంచే వీక్షించవచ్చు.

 

ఇది కూడా చదవండి: శ్రీరామనవమి శుభాకాంక్షలతో! సీతారామ కళ్యాణం, పానకం, వడపప్పు విశిష్టత!

 

ఈరోజు అయోధ్యకు 20 లక్షల మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో ఆలయ ట్రస్ట్ విస్తృత ఏర్పాట్లు చేసింది. సామాన్య భక్తుల అనవసర భారం తగ్గించేందుకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకూ ప్రత్యేక పాస్‌లను రద్దు చేశారు. ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు, తాగునీటి సదుపాయాలు, తాత్కాలిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు ఏడు చోట్ల 108 అంబులెన్సులు సిద్ధంగా ఉంచారు. అంతేకాక, డ్రోన్ల సాయంతో సరయూ నదీ జలాలను భక్తులపై జల్లే ఏర్పాట్లు చేశారు. దాదాపు 500 ఏళ్ల తర్వాత రాముడి జన్మస్థలంలో నిర్మితమైన ఈ దివ్య ఆలయం గతేడాది జనవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రతిష్ఠింపబడినది.

 

ఇది కూడా చదవండికొలికపూడి పదవికి డేంజర్ బెల్స్.. సీఎం చంద్రబాబు షాక్ ట్రీట్‌మెంట్‌! కొత్త నాయకత్వానికి సంకేతాలా?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కీలక దశకు పాస్టర్ ప్రవీణ్ మృతి.. మాజీ ఎంపీపై కేసు న‌మోదు! వైసీపీ గుండెల్లో గుబులు..

 

సెల్ఫీ వీడియోతో కలకలం! ఎస్ఐ వేధింపులతో ఆత్మహత్యాయత్నం!

 

ఆ రూట్ ని మోడరన్ రహదారిగా.. సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్! నాలుగు లైన్ల రహదారి రూపంలో..!

 

ఏపీలో మెడిసిన్ మేకింగ్ హబ్.. భారీ పెట్టుబడులతో మెగా ప్రాజెక్ట్! 7,500 మందికి ఉపాధి కల్పన!

 

అమెరికాను వీడొద్దు వెళ్తే రాలేరు.. హెచ్‌1బీ వీసాదారులకు - టెక్‌ దిగ్గజాల అలర్ట్‌! ఉద్యోగుల గుండెల్లో గుబులు..

 

అమెరికాను వీడొద్దు వెళ్తే రాలేరు.. హెచ్‌1బీ వీసాదారులకు - టెక్‌ దిగ్గజాల అలర్ట్‌! ఉద్యోగుల గుండెల్లో గుబులు..

 

ఏపీకి మరో భారీ పెట్టుబడి వచ్చింది.. రూ.5వేల కోట్లతో - ఆ జిల్లాకు మహర్దశ! ప్రత్యక్షంగాపరోక్షంగా 7,500 మందికి..

 

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. తీసుకున్న కీలక నిర్ణయాలివే.! వారికి గుడ్ న్యూస్..

 

వైసీపీ ఎంపీ అరెస్ట్.. ప్యాలెస్ షేక్! లిక్కర్ స్కాంలో హైకోర్టు కీలక నిర్ణయం..!

 

రూ.119 కోట్లు తప్పుదారిపట్టించిన రోజా.. ఆమె అరెస్టు పక్కా! ఎవ్వరూ ఆపలేరు..

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #SriRamaNavami #AyodhyaCelebrations #SuryaTilak #DivineDarshan #RamMandirAyodhya #RamaNavami2025 #AyodhyaLive #RamBhakthi